Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి నిషేధం విధించాలని కోరుతూ శివసేన దాఖలు చేసిన పిటీషన్ను ఈ నెల 11న సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ 16 మందిపై అనర్హత అంశంపై పెండింగ్లో ఉన్న కారణంగా, ఆ విషయం నిర్థారణ అయ్యే వరకూ వీరిని అసెంబ్లీ నుంచి నిషేధం విధించాలని శివసేన పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జెబి పార్ధివాలాలతో కూడిన ధర్మాసనాన్ని శివసేన తరుపున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ అభ్యర్థించారు. ఈ పిటిషన్ను 11న విచారించడానికి ధర్మాసనం అంగీకరించింది.