Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు బస్ స్టేషన్ల వద్ద ధర్నాలు వామపక్ష పార్టీల పిలుపు
అమరావతి : ఆర్టిసి బస్సు ఛార్జీల మోతకు నిరసనగా నేడు (జులై రెండవ తేది) రాష్ట్ర వ్యాప్తంగా బస్స్టేషన్ల ముందు నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని వామపక్షపార్టీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వామపక్ష పార్టీల నేతలు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ(ఎంఎల్) న్యూడెమెక్రసీ నాయకులు సాంబశివరావు, సిపిఐ(ఎంఎల్) నాయకులు జాస్తి కిషోర్‌బాబు, ఎంసిపిఐ(యు) నాయకులు కాటం నాగభూషణం, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు ఎన్.మూర్తి, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు,ఎస్‌యుసిఐ()సి నాయకులు బిఎస్ అమర్నాథ్, ఫార్వార్డ్‌బ్లాక్ నాయకులు పి.వి.సుందరరామరాజు, ఆర్ఎస్పి తరపున జానకిరాములు విడుదల చేసిన ఈ ప్రకటనలో మూడు నెలల కాల పరిమితిలోనే రెండోసారి డీజిల్‌సెస్ పేరుతో 500 కోట్ల రూపాయల భారం మోపుతూ ఆర్టిసి బస్సు ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజల నిరసనల ఫలితంగా డీజిల్ రేట్లు రూ.10 తగ్గిన తరుణంలో డీజిల్ సెస్ పేరుతో భారం మోపడం శోచనీయమని పేర్కొన్నారు. 30 కిలోమీటర్ల పైన ప్రయాణించే వారందరిపైనా రూ.10 నుండి రూ.100 వరకు టికెట్ ధర పెంచడం గర్హనీయమని తెలిపారు. విద్యార్థులు బస్ పాసుల రేట్లను కూడా పెంచడం అన్యాయమని పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, ఇతర ధరలు విపరీతంగా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలు అతలాకుతల మవుతుంటే ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిందిపోయి బస్ ఛార్జీలు పెంచడం గోరుచుట్టుపై రోకటి పోటవుతుందని పేర్కొన్నారు. పెంచిన బస్ఛార్జీల నిర్ణయాన్ని తక్షణం ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు.