Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యాలయంపై బాంబు దాడిని ఖండించిన పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : కేరళ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఏకేజీ సెంటర్‌పై గురువారం రాత్రి జరిగిన బాంబు దాడిని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. బాంబు దాడి ఘటనను పిరికిపందల చర్యగా అభివర్ణించింది. ఈదాడిని ప్రజాస్వామ్య శక్తులు ఖండించాలని, శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేయాలని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పొలిట్‌బ్యూరో తెలిపింది. బాంబు దాడి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి దోషుల్ని శిక్షిస్తుందనే నమ్మకం పొలిట్‌బ్యూరో వ్యక్తం చేసింది.