Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏక్నాథ్ షిండేకు ఠాక్రే లేఖ
- ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ జులై 11న సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ : శివసేన తిరుగుబాటు నేత, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేపై ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారులు అనర్హత వేటు వేశారు. పార్టీ నుంచి షిండేను తొలగిస్తున్నామని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. షిండే సహా 15మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఉద్ధవ్ ఠాక్రే అనర్హత వేటు వేయగా, వివాదం ఇప్పుడు సుప్రీం ముంగిట చేరింది. అనర్హత వేటు పిటిషన్ను జులై 11న సుప్రీంకోర్టు విచారించనున్నది.
'అసలు శివసేన' పార్టీ మాదేనని ఏక్నాథ్ షిండే వర్గం వాదిస్తోంది. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును కోరింది. ఈనేపథ్యంలో సీఎం షిండేకు ఠాక్రే లేఖ రాయటం వార్తల్లో నిలిచింది. పార్టీకి వెన్నుపోటు పొడిచారని లేఖలో షిండేపై ఆరోపించారు. శివసేన పార్టీ సభ్యుడ8ిగా షిండే సభ్యత్వాన్ని కోల్పోయారని, శివసేన అధ్యక్షుడిగా పార్టీ నుంచి షిండేను తొలగిస్తున్నానని లేఖలో ఠాక్రే పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 30న ఈ లేఖను ఠాక్రే పంపారు.