Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లోని అన్ని విభాగాలను ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ రద్దు చేశారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇటీవల ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఫలితాలపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సమాజ్ వాదీ పార్టీలో అన్ని పదవులు రద్దు చేశారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి, యూత్, మహిళా విభాగాలను అన్నింటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవితో పాటు సమాజ్ వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్‌ను మాత్రమే పదవీలో కొనసాగించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు వీలుగా, పార్టీని ప్రక్షాళన చేస్తున్నట్లు ఎస్పీ సీనియర్ నాయకులు ఒకరు వెల్లడించారు.