Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌కు చెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు గ్రహీత సనా ఇర్షాద్ మట్టూను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. ఫ్రాన్స్ వెళ్లేందుకు ఆమె విమానాశ్రయానికి రాగా.. అడ్డుకున్నారు. పారిస్‌లో జరుగుతున్న పుస్తకావిష్కరణ, ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌కు హాజరయ్యేందుకు వెళుతుండగా.. విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారని, ఎలాంటి కారణాలు చెప్పలేదని, తాను విదేశాలకు వెళ్లలేనని అధికారులు చెప్పినట్లు ట్వీట్ చేశారు. 'సెరెండిపిటి అర్లెస్ గ్రాంట్ 2020 ప్రకటించిన 10 మంది విజేతల్లో ఒకరిగా పుస్తకావిష్కరణ, ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిమిత్తం శనివారం ఢిల్లీ నుంచి పారిస్‌కు వెళ్ల్లాల్సి ఉంది. ఫ్రెంచ్ వీసాను కూడా సంపాదించాను. అయితే ఢిల్లీ విమానాశ్రయం ఇమ్మ్గిగ్రేషన్ అధికారులు నన్ను అడ్డుకున్నారు' అని రద్దు చేసిన బోర్డింగ్ పాస్‌ను ట్వీట్ చేశారు. అయితే తనను ఫ్రాన్స్ వెళ్లకుండా అడ్డుకోవడం వెనుక కారణలు చెప్పలేదని, విదేశాలకు మీరు ప్రయాణించలేరని మాత్రమే చెప్పారని అన్నారు. అయితే కాశ్మీర్లో నో ఫ్లై లిస్ట్‌లో ఉంచిన పలువురు జర్నలిస్టులో సనా కూడా ఉన్నారని జమ్మకాశ్మీర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 2019లో కాశ్మీర్ జర్నలిస్ట్ గౌహర్ జిలానీని కూడా జర్మనీకి వెళ్లకుండా ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోగా.. గత ఏడాదిలో అడ్మినిస్ట్రేషన్ జర్నలిస్టుగా మారిన విద్యావేత్త జాహిద్ రఫీక్‌ను అమెరికా వెళ్లకుండా అధికారులు నిర్బంధించారు.