Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: విమాన చార్జీల పెంపు వల్ల ప్రవాసులు, పర్యాటక రంగానికి ఎదురవుతున్న ఇబ్బందులను ఎత్తి చూపుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కోవిడ్ మహమ్మారి ముందు కంటే దేశీయ, అంతర్జాతీయ సేవలకు కంపెనీలు అధిక రేట్లు వసూలు చేస్తున్నాయి. దీంతో స్వదేశానికి వచ్చే ప్రవాస సోదరులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.కోవిడ్ మహ మ్మారి కారణంగా ఏర్పడిన కష్టాల నుండి కోలుకుంటున్న సమాజానికి రేటు పెంపు పెద్ద దెబ్బ. సుదీర్ఘ షట్డౌన్ కారణంగా సంక్షోభంలో ఉన్న కేరళ పర్యాటక రంగాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఈ ఆందోళనలను దష్టిలో ఉంచుకుని విమాన చార్జీల పెంపు విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని లేఖలో ముఖ్యమంత్రి కోరారు.