Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోనే ఉంది. శనివారం 3,76,720 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, 16,103 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 31 మంది కరోనాతో మరణించారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,35,02,429 కాగా, 5.25 లక్షల మందికి పైగా మరణించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 1,11,711గా ఉంది. అంతకు ముందురోజుతో పోల్చుకుంటే 2,143 క్రియాశీలక కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసుల శాతం 0.26 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 13,929 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 4.28 కోట్ల మంది కరోనాను జయించారు. దీంతో రికవరీ రేటు 98.54 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 197.95 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేశారు.