Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : బ్యాంకును మోసం చేసిన మనీలాండరింగ్ కేసులో తమిళనాడులోని చెన్నైలో శరణవ స్టోర్ (గోల్డ్ ప్యాలెస్)కు చెందిన రూ. 234.75 కోట్ల విలువ చేసే చరాస్థులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది ఈ ఏడాది ఏప్రిల్ 25న సీబీఐ, ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం ఇడి కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతోంది. చెన్నైలోని టి-నగర్లో ఉన్న ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌ను మోసం చేసేందుకు స్టోర్ భాగస్వామ్యులు పల్లకుదురై, పి. సుజాత, వైపి శిరవణ్తో సహా గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులతో కలిసి కుట్రపన్నారన్న ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తులో శరవణ స్టోర్ (గోల్డ్ ప్యాలెస్) రుణాల కోసం బ్యాంకును సంప్రదించినట్లు వెల్లడైంది.
ఈ సంస్థ విక్రయాలు, ఇతర ఆర్థిక లావాదేవీల్లో తేడాలు గుర్తి ంచినట్లు అధికారి తెలిపారు. అదేవిధంగా మరొక మనీలాండరింగ్ కేసు లో 'ద లాటరీ కింగ్' వ్యవస్థాపక చైర్మన శాంటియాగో మార్టిన్ ఆస్తులను కూడా జప్తు చేసింది. రూ. 173.48 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిఇంది. కొచ్చిలోని సీబీఐకి చెందిన అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపడుతోంది.