Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ ఆహారశాఖ మంత్రి అనిల్
తిరువనంతపురం: ప్రజా పంపి ణీ వ్యవస్థను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తోందని కేరళ ఆహార శాఖ మంత్రి జీఆర్ అనిల్ అన్నారు. కిరోసిన్ ధరలను పెంచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి ఇచ్చే కిరోసిన్లో 40 శాతం కోత పెట్టిందని అన్నారు. కిరోసిన్ బదులు పెట్రోల్, డీజిల్ వాడాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదని. మత్స్య కార్మికులను రోడ్డున పడేసే ఈ నిర్ణయం నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏడు నెలల్లో రేషన్ కిరోసిన్ ధరను రెట్టింపు చేసిందన్నారు. ఒక్కసారిగా రూ.14 పెరగడంతో లీటరు ధర రూ.102కి చేరిందన్నారు. గత నవంబర్లో లీటరుకు రూ.45.55గా ఉంది. మే నెలలో లీటరుకు రూ.84 ఉండగా, జూన్లో రూ.88గా ఉంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచలేదు. ఇప్పటికీ రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ కిరోసిన్ రూ.84కే పంపిణీ చేస్తున్నామన్నారు. స్టాక్ అయిపోయే వరకు ఈ ధరకే కార్డుదారులకు కిరోసిన్ అందించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో విద్యుదీకరించిన ఇల్లు ఉన్న కార్డుదారునికి ఒక లీటరు, విద్యుత్ లేని ఇల్లు ఉన్న కార్డుదారునికి నాలుగు లీటర్లు అందించడానికి నెలకు 9276 కిలోలీటర్ల కిరోసిన్ అవసరం. ప్రభుత్వం ఆధీనంలో నమోదైన 14,481 మత్స్యకారులకు నెలకు 8398 కిలోలీటర్ల కిరోసిన్ అవసరం.ఇంకా వ్యవసాయ అవసరాలకు 8184 కిలోలీటర్లు అవసరం. ఈ విషయంలోనూ కేంద్రం అవసరమైన మొత్తంలో నాలుగో వంతు మాత్రమే కేటాయిస్తోందని ఆయన అన్నారు. కిరోసిన్ సబ్సిడీని మొత్తంగా ఎత్తివేసి మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు మత్స్యకారులను వదిలేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.