Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : అంగన్వాడీల్లో చిన్నారుల పోషహాకారం కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని నేరపూరితమైన నిర్లక్ష్యంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. భారత్ ఇప్పటికే ప్రపంచ చిన్నారుల పోషకాహార జాబితాలో అట్టడుగున ఉందని గుర్తు చేశారు. మన భవిష్యత్‌ను నాశనం చేసే ఇటువంటి నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహ రించుకోవాలని సీతారాం ఏచారి డిమాండ్ చేశారు. కాగా, మరొక ట్వీట్లో జుబెర్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ పోలీసులు ముందుగానే ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేయాలని సీతారాం ఏచూరి విజ్ఞప్తి చేశారు.