Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ సెక్రెటరీ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో ఉన్న శ్లాబులను హేతుబద్దీకరించే యోచనలో ఉన్నామని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. సోమవారం ఆయన పరిశ్రమ వర్గాలతో మాట్లాడుతూ లగ్జరీ ఉత్పత్తులపై 28 శాతం పన్ను రేటు కొనసాగుతుందన్నారు. కానీ 5, 12, 18 శ్లాబులను రెండుగా మార్చే అవకాశాలపై సంప్రదింపులు, చర్చలు జరుగుతాయన్నారు. జీఎస్టీ అందుబాటులోకి వచ్చి ఐదేండ్లు పూర్తి అయ్యిందన్నారు. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై వేచి చూసే ధోరణీలో ఉన్నామన్నారు.