Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాచల్ ప్రదేశ్లో ఘోరం
సిిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూలు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 12 మంది చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 11 మంది అక్కడికక్కడే మరణించగా, ఒకరు ఆసుపత్రిలో మరణించారు. కులూ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో ఈ ఘోరం జరిగింది. షంషార్ నుంచి సైంజ్కు వెళుతున్న బస్సు సోమవారం ఉదయం 8:45 గంటల సమయంలో జంగ్లా గ్రామ సమీపంలో 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయిందని కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ చెప్పారు. రోడ్డుపై కొండచరియలు విరిగి పడడంతో వాటిని తప్పించుకుని వెళ్లే యత్నంలో బస్సు అదుపు తప్పి లోయలోకి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో మొత్తం 15 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి మృతుల కుటుంబాలకు రూ2 లక్షలు, గాయపడినవారికి 50 వేలు చొప్పున చెల్లించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఈ ఘటన పట్ల దిగ్భ్ర్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.