Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తెలంగాణలోని వనపర్తికి చెందిన ఉందకోటి రాముడికి విశిష్ట సేవా మెడల్ లభిచిందింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినరు కుమార్ సక్సేనా చేతులు మీదుగా ఆయన అందుకున్నారు. సోమవారం నాడిక్కడ ఢిల్లీ పోలీస్ కమిషనర్ డే (50 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా) ఉత్సవాలు కింగ్స్ వే క్యాంప్‌లోని న్యూ పోలీస్ లైన్ మైదానంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వినరు కుమార్ సక్సేన, ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థాన పాల్గొన్నారు. మెరిటోరియస్ సేవలకు గాను ఉందకోటి రాముడు మెడల్ లభించింది. 1994లో ఢిల్లీ పోలీసులో కానిస్టేబుల్ గా నియమితులైన రాముడు, కీర్తి నగర్ పోలీస్ స్టేషన్, పశ్చిమ ఢిల్లీ స్పెషల్ స్టాప్‌లో నకిలీ నోట్ల ముఠాలను, గ్యాంగ్ స్టార్లను చేదించడంలో ముందుండేవాడు. 2018 నుంచి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. స్పెషల్ సెల్లో చేరిన నాలుగైదు నెలలకే ఉగ్రవాదులను పట్టుకున్న కేసులో హెడ్ కానిస్టేబుల్‌గా ఔట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ పొందాడు. 2012 నుంచి 2017 వరకు డిప్టేషన్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ)లో కానిస్టేబుల్ గా హైదరాబాదులో విధులు నిర్వహించాడు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాదులో దిల్ సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల సంఘటన జరిగినప్పుడు, అక్కడికి వెళ్లి నిందితులను పట్టుకునేందుకు కావాల్సిన సాక్షాలను సేకరించాడు. ఇండియన్ ముజాహిద్దీన్‌కు చెందిన యాసిన్ బత్కల్ అతని సన్నిహితులను బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడేందుకు అధికారులతో కలిసి పనిచేశాడు.