Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోటళ్లకు కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీసు చార్జీలు వసూళ్లు చేయకూడదని సెంట్రల్ కస్టమర్ ప్రొజెన్ అథారిటీ (సీసీపీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. డిఫాల్ట్ లేదా ఆటోమెటిక్ పద్దతిలో చార్జీ చేయడానికి వీలులేదని.. ఒక వేళ చార్జీ చేస్తే ముందుగానే వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించింది. సర్వీసు చార్జీలపై వినియోగదారుల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో సీసీపీఏ సోమవారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వివరాలు.. సర్వీసు ఛార్జీలు చెల్లించాలని వినియోగదారులపై ఒత్తిడి చేయకూడదు. ఏ ఇతర పేరుతోనూ సర్వీసు చార్జీలను వేయడానికి వీలు లేదు. బిల్లులో ఆటోమెటిక్‌గా చార్జీని వేయకూడదు. ఒక వేళ ఏ హోటల్, రెస్టారెంట్ అయినా సర్వీసు చార్జ్ వేయాలనకుంటే ముందుగానే వినియోగదారుడికి సమాచారం ఇవ్వాలి. ఏ సంస్థ అయినా సర్వీసు చార్జ్ విధిస్తే తొలగించాలని వినియోగదారులు డిమాండ్ చేయవచ్చు. వినియోగదారులు సర్వీసు చార్జీలపై 1915 నెంబర్‌కు ఫోన్ చేసి లేదా సీసీపీఏ ఇ-మెయిల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.