Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 10తో ముగియనున్న వెంకయ్య పదవీకాలం
న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది. 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గత నెల 29న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 22న గడువు ముగియనున్నది. ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. కొత్తగా ఎన్నికైన ఉప రాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకోనుంది. 233 మంది రాజ్యసభ సభ్యులతోపాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు, 543 మంది లోక్ సభ ఎంపీలతో కలుపుకుని మొత్తం 788 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇప్పటి వరకు ఒక్క మహిళా కూడా ఉపరాష్ట్రపతిగా లేనందున ఈసారి ఆ అవకాశం మహిళకు దక్కనుందా? అన్న అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది.