Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిట్టచివరిలో గోవా..ఏపీకీ మూడవ స్థానం
- అక్టోబరు 15 లోగా ఆహార సబ్సిడీ బకాయిలిస్తాం : పియూశ్ గోయల్
న్యూడిల్లీ: ఆహార భద్రతలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలవగా..తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. మంగళవారం నాడిక్కడ జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) రాష్ట్రాల ర్యాంకింగ్ ఇండెక్స్‌ను కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి పియూష్ గోయల్ విడుదల చేశారు. ఎన్ఎఫ్ఎస్ఏ అమలు తీరు, పురోగతి, వివిధ సంస్కరణలు ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. ఆహార భద్రత అమలులో జనరల్ కేటగిరీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఇండెక్స్‌లో స్కోరు 0.794తో ఏపీ మూడోస్థానంలో నిలిచింది. 0.836 స్కోరుతో తొలి స్థానంలో ఒడిశా, 0.797 స్కోరుతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. 0.743 స్కోరుతో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది. గోవా (0.631 స్కోర్) చివరి స్థానంలో నిలిచింది. స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో త్రిపుర (0.788 స్కోర్), హిమాచల్ ప్రదేశ్ (0.758 స్కోర్), సిక్కిం (0.710 స్కోర్)లు మొదటి స్థానంలో నిలిచాయి. లడఖ్ (0.412 స్కోర్), మేఘాలయా (0.512 స్కోర్)లు చివరి స్థానంలో నిలిచాయి. అయితే జనరల్ కేటగిరీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు, స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ర్యాంకింగ్‌లను కేంద్రం ప్రకటించింది.అక్టోబర్ 15లోగా ఆహార సబ్సిడీ బకాయిలిస్తామని కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ తెలిపారు.