Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ విద్యావేత్త నోమ్ చోమ్స్కీ, రాజ్మోహన్ గాంధీ డిమాండ్
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మాజీ విద్యార్థి ఉమర్ ఖాలీద్ను వెంటనే విడుదల చేయాలని ప్రముఖ విద్యావేత్త నోమ్ చోమ్స్కీ, మహాత్మా గాంధీ మనవడు, ప్రొఫెసర్ రాజ్ మోహన్ గాంధీ డిమాండ్ చేశారు. ఉమర్ ఖాలీద్ అరెస్టును నోమ్ చోమ్స్కీ, రాజ్ మోహన్ గాంధీతో పాటు నాలుగు అంతర్జాతీయ సంస్థలు ఖండించాయి. చోమ్స్కీ, రాజ్మోహన్ గాంధీతో పాటు హిందువులు ఫర్ హ్యూమన్ రైట్స్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, దళిత్ సాలిడారిటీ ఫోరమ్, ఇండియా సివిల్ వాచ్ ఇంటర్నేషనల్ సంస్థలు ఉమర్ ఖాలీద్ అరెస్టుపై స్పందించాయి. 2020 సెప్టెంబరు 13న అరెస్టు అయి, కస్టడీలో ఉన్న ఖాలీద్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ''అణచివేత, తరచుగా హింస, స్వేచ్ఛా సంస్థలను అణగదొక్కే సమయంలో దేశంలో న్యాయ వ్యవస్థపై కీలక పాత్ర పోషించాలి. దేశ లౌకిక ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వ ప్రయత్నం చేస్తుంది'' అని నోమ్ చోమ్స్కీ అన్నారు. రాజ్మోహన్ గాంధీ ''ఉమర్ ఖాలీద్ దేశంలో అత్యుత్తమ మనస్తత్వాన్ని కలిగి ఉన్న వారిలో ఒకడు. దేశంలోని తెలివైన యువ పరిశోధకుడు ఇప్పుడు 20 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఖాలీద్ మౌనం ప్రపంచం ముందు దేశ ప్రతిష్టకు మచ్చ'' అని అన్నారు. ఖాలీద్ పై ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ), అల్లర్ల ''సూత్రధారు''లలో ఒకడని ఆరోపిస్తూ ఐపీసీలోని వివిద సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.