Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్కతా : క్యూబన్ విప్లవకారుడు చెగువేరా భారత్లో తొలి పర్యటనకు 63 ఏండ్లు నిండిన సందర్భంగా కొల్కతాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 1959 జున్ 30న భారత్కు తొలిసారిగా వచ్చారు. అప్పటి ప్రధాని నెహ్రూతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం తరువాత నుంచే భారత్-క్యూబా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడ్డాయి. ఈ పర్యటనలో భాగంగా కొల్కత్తాలోనూ చెగువేరా పర్యటించారు. నగరంలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)ని సందర్శించిన చెగువేరా కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. ఈ పర్యటన జాపకార్థం ఆల్ ఇండియా పీస్ అండ్ సొలిడరిటీ ఆర్గనైజేషన్ (ఏఐపీఎస్ఓ) కొల్కతాలోని జాదవ్పూర్ యూనివర్విటీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని క్యూబన్ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ అబల్లే డిస్పాంజే, సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి, ఏఐపీఎస్ఓ నాయకులు ఎండి సలీం, ప్రొఫెసర్ సోభన్లాల్ దత్తా గుప్తా తదితరులు పాల్గొన్నారు.