Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలోనే అత్యధికం..కేరళలో అత్యల్పం
న్యూఢిల్లీ: దేశంలో ఎమ్మెల్యేలకు అత్యధిక వేతనం తెలంగాణలో చెల్లించగా, అత్పల్పం కేరళలో చెల్లిస్తుంది. ఇటీవల ఎమ్మెల్యేల వేతనాన్ని పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో దేశంలో ఏఏ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల వేతనం ఎంత ఉందో అంశం మరోసారి చర్చకు వచ్చింది. జులై 4, 5 తేదీల్లో జరిగిన రెండు రోజుల ప్రత్యేక సమావేశంలో ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలోని మంత్రులు, చీఫ్ విప్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష నాయకుడి జీతాలు, అలవెన్సులను పెంచడానికి ఐదు బిల్లులను ఆమోదించింది. ఎమ్మెల్యేల విషయానికొస్తే, వారి వేతనాన్ని అన్ని అలవెన్స్లతో కలిపి నెలకు రూ.90,000కు పెంచాలనేది ప్రతిపాదన. 2011లో చివరిగా సవరించిన జీతం రూ.54,000తో పోలిస్తే ఇది 66 శాతం పెరిగింది. మూల వేతనం రూ.12,000 నుంచి రూ.30,000కి పెరిగింది. నియోజకవర్గ భత్యం రూ. 6,000 నుండి రూ. 10,000కి పెరిగింది. టెలిఫోన్ బిల్లు చార్జీలు రూ. 8,000 నుంచి రూ. 10,000 వరకు ఉంటాయి. సచివాలయ భత్యాన్ని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు. అయినప్పటికీ, ఢిల్లీలోని శాసనసభ్యులు ఇతర రాష్ట్రాల్లోని వారి కంటే తక్కువ జీతాలను తీసుకుంటారు.
స్వతంత్ర పరిశోధనా సంస్థ పీఆర్ఎస్ లేజిస్లేటివ్ డేటా ప్రకారం, తెలంగాణ ఎమ్మెల్యే జీతం రూ. 20,000, కానీ నియోజకవర్గ భత్యం రూ. 2.30 లక్షలు. మొత్తం రూ. 2.50 లక్షల వరకు ఎమ్మెల్యే జీతం ఉంటుంది. ఇది దేశంలోనే అత్యధికంగా ఉంది. కరా ్నటకలో ఎమ్మెల్యేకు రూ. 2.05 లక్షల వేతనం ఉంది. ఉత్తరప్రదేశ్ (రూ. 1.87 లక్షలు), బీహార్ (రూ. 1.65 లక్షలు), జమ్మూ కాశ్మీర్ (రూ. 1.60 లక్షలు), మహారాష్ట్ర (రూ. 1.60 లక్షలు) ఎమ్మెల్యేల వేతనం ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేలు రూ. 55,000 జీతం తీసుకుంటుండగా, వారి అలవెన్సులు, రోజువారీ, సెక్రెటేరియల్, టెలిఫోన్ బిల్లు రూ. 1.30 లక్షలు ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే మొత్తం వేతనం రూ.1.85 లక్షల ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే జీతం రూ.12,000 ఉండగా, నియోజకవర్గ అలవెన్స్ కింద మరో రూ.1.13 లక్షలు చెల్లిస్తారు. మొత్తం రూ.1.25 లక్షల వేతనం ఉంటుంది.
కేరళలో...
కేరళ ఎమ్మెల్యేల మూల వేతనం దేశంలోనే అత్యల్పంగా ఉంది. అక్కడ ఎమ్మెల్యే మూలవేతనం కేవలం రూ.2,000 మాత్రమే ఉంది. వారికి సెక్రెటేరియల్ అలవెన్స్ కూడా ఇవ్వరు. కానీ ఇతర అలవెన్సులు కలిపితే ఒక్కొ ఎమ్మెల్యే నెల వారీ వేతనం రూ.43,750 అవుతుంది. త్రిపుర (రూ. 48,420), రాజస్థాన్ (రూ. 55,000), సిక్కిం (రూ. 52,000), మిజోరం (రూ. 65,000)ల్లో వేతనాలు కేరళ కంటే ఎక్కువే ఉన్నాయి. అయినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల వేతనం తెలంగాణ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువే ఉంది.
రాష్ట్ర శాసనసభ్యులు తమ తమ రాష్ట్రాలలో ఒక చట్టాన్ని ఆమోదించడంతో వారి శాసనసభ్యుల జీతాలు, భత్యాలను నిర్ణయిస్తారు. ఢిల్లీ ప్రభుత్వం 2015లో జీతాలను 2.10 లక్షలకు పెంచాలని ప్రయత్నించింది. అయితే అప్పుడు కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దానికి ఆమోదం తెలపలేదు.
రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యే వేతనం
రాష్ట్రం వేతనం
తెలంగాణ రూ.2,50,000
కర్నా టక రూ.2,05,000
ఉత్తరప్రదేశ్ రూ.1,87,000
హిమాచల్‌ప్రదేశ్ రూ.1,85,000
బీహార్ రూ.1,65,000
జమ్మూ కాశ్మీర్ రూ.1.60,000
మహారాష్ట్ర రూ.1,60,000
ఆంధ్రప్రదేశ్ రూ.1,25,000
గుజరాత్ రూ.1,27,000
మిజోరం రూ.65,000
రాజస్థాన్ రూ.55,000
సిక్కిం రూ.52,000
త్రిపుర రూ.48,420
కేరళ రూ.43,750