Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇళయరాజా,పిటి ఉషా,విజయేంద్రప్రసాద్, వీరేంద్ర హెగ్డే
- రాష్ట్రపతి కోటాలో దక్షిణాది నుంచి నలుగురికి చోటు
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకులు, సినీ కథా రచయిత వి విజేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభలో చోటు దక్కింది. ఆయనతో పాటు మరో ముగ్గురు ప్రముఖులకు కూడా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభలో చోటు లభించింది. బుధవారం నలుగురిని రాజ్యసభ్యులుగా నామినేట్ చేశారు. దక్షిణాది నుంచే నలుగురు ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రాష్ట్రపతికి పంపగా, ఆయన ఆమోదిస్తూ వారిని రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేశారు. ప్రముఖ సినీ కథా రచయిత, ఎస్‌ఎస్‌రాజమౌళి తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్(ఆంధ్రప్రదేశ్), పరుగుల రాణి పిటి ఉషా (కేరళ), మాస్ట్రో ఇళయరాజా (తమిళనాడు), ధర్మస్థల నిర్వాహాధాకారి వీరేంద్ర హెగ్డే (కర్నా టక)ని నామినేట్ చేశారు. వీళ్ల నామినేట్ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విటర్లో ప్రకటించారు.
రాజ్యాంగాధికారం ప్రకారం.. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్థిక రంగాలతోపాటు వివిధ రంగాలకు చెందిన 12 మంది ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం ఉంది. ఆ కోటాలోనే ఆరేండ్ల కింద మోడీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువసభకు పంపింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఇళయరాజా ఇటీవల 'అంబేద్కర్ - మోడీ' పుస్తకానికి ముందుమాటలో ప్రధాని మోడీ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.
విజయేంద్ర ప్రసాద్ జీవిత చరిత్ర
తూర్పు గోదావరి జిల్లా కొవ్వురులో జన్మించిన కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్ ఒక భారతీయ స్క్రీన్ రైటర్. చలనచిత్ర దర్శకుడు. తమిళ, హిందీ సినిమాలతో పాటు ప్రధానంగా తెలుగు సినిమాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందారు . అతని ఫిల్మోగ్రఫీలో స్క్రీన్ రైటర్‌గా ఇరవై ఐదు కంటే ఎక్కువ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. బాహుబలి ఫ్రాంచైజీ , ఆర్ఆర్ఆర్, బజరంగీ భాయిజాన్ , మణికర్ణిక, ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ , మగధీర, మెర్సల్ వంటి చిత్రాలను స్క్రీన్ రైటర్‌గా అతని గుర్తింపు లభించింది. 2011లో అతను తెలుగులో రాజన్న చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. అతను బజరంగీ భాయిజాన్ చిత్రానికి 2016లో ఉత్తమ కథగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. వి విజయేంద్ర ప్రసాద్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా దర్శకుడిగా ఉన్నారు. ప్రసాద్ స్క్రీన్ రైటింగ్ ద్వయం సలీం-జావేద్ ( సలీం ఖాన్, జావేద్ అక్తర్ ) తన పనికి ప్రధాన ప్రేరణగా పేర్కొన్నారు.