Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా విదేశాంగ మంత్రితో జై శంకర్ భేటీ
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ పొడవునా గల అప రిష్కృత సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరించుకోవాల్సిన అవసరం వుం దని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యికి స్పష్టం చేశారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాలు బాలిలో జి 20 దేశాల విదేశాంగ మంత్రలు సమావేశం సందర్భంగా వీరిరువురు గంట పాటు భేటీ అయ్యారు. సరిహద్దు సమస్యను పరిష్కరించు కునేందుకు సత్వరమే ఇరు పక్షాలు తదుపరి రౌండ్ మిలటరీ చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తు న్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక ఒప్పందాల కు, ప్రొటోకాల్స్‌కు, గత సమావేశాల్లో ఇరువురి మధ్య కుదిరిన అవగాహనల కు పూర్తిగా కట్టుబడి వుండాల్సిన ప్రాముఖ్యతను జై శంకర్ పునరుద్ఘా టించారు.
ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ఘర్షణ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణను గుర్తు చేసుకుంటూ జై శంకర్, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరు ద్ధరించేందుకు గానూ మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా బలగాలను ఉప సంహరించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం వుందని అన్నారు. క్రమం తప్ప కుండా సమా వేశాలు జరుపుతూ త్వరగా సీనియర్ కమాండర్ల సమావేశం జరిగేలా చూడాలని ఉభయ పక్షాలు నిర్ణయించాయి.