Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారణాసి : దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అసరముందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. బ్రిటీష్ వాళ్లు తమ అవసరాలను తీర్చుకోవడానికి అనుగుణంగా 'బానిస వర్గా'న్ని సృష్టించే విద్యా విధానాన్ని దేశంలో అమల్జేశారని ఆయన తప్పుబట్టారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి) అమలుకు సంబంధించి వారణాసిలో నిర్వహించిన ఒక సదస్సును ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. కేవలం డిగ్రీ పట్టాలను అందిచడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపే మానవ వనరులను అదించేలా విద్యా వ్యవస్థ ఉండాలని ఆయన తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు జరిగాయని, అయితే ఇంకా చాలా మార్పులు చేయాల్సిన అవసరముందని మోడీ చెప్పారు.