Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందులో రెండు ఇప్పటికే తిరస్కరణ
న్యూఢిల్లీ:దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి ఎన్ని కలకు ఇప్పటి వరకు మూడు రోజుల్లో ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అందు లో రెండు నామినేషన్లను దాఖలు చేసిన సమయంలోనే తిర స్కరించారు. ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ల ప్రక్రియ జూలై 5న ప్రారం భమైంది. ఈ మూడు రోజుల్లో ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జలుముర్ మండలం, శ్రీముఖలింగం గ్రామానికి చెందిన నాయుడుగారి రాజశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. కె.పద్మరాజన్ (తమిళనాడు), పరిశకుమార్ (గుజరాత్), విజయనంద్ (కర్ణాటక), ఆనంద్ సింగ్ కుశ్వాహా (మధ్యప్రదేశ్), ఓం ప్రకాశ్ ఖర్బండా (ఢిల్లీ), దయా శంకర్ అగర్వాల్ (ఢిల్లీ)లు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీరిలో నాయుడుగారి రాజశేఖర్, దయ శంకర్ అగర్వాల్ నామినేషన్లు దాఖలు చేసిన సమయంలోనే తిరస్కరించారు. మిగిలిన ఐదు నామినేషన్లు జూలై 20న పరిశీలిస్తామని లోక్సభ సెక్రెటేరియట్ తెలిపింది.