Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11న సమావేశం
న్యూఢిల్లీ : వివాదాస్పద సాయుధ దళాల రిక్రూట్మెంట్ అగ్నిపథ్ పథకంపై జూలై 11న (సోమవారం) కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ చర్చించనుంది. ఈ సమావేశంలో అగ్నిపథ్‌పై ప్రతిపక్ష ఎంపీల నుంచి ప్రభుత్వం కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొనుంది. ఈ సమావేశం... ముందుగా జూలై 8న షెడ్యూల్ చేయబడింది. అయితే కొన్ని కారణాల రీత్యా జూలై 11కి వాయిదా పడింది. జూలై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశం అందుకు వేదిక కాబోతుంది. అగ్నిపథ్ పథకంపై తమ ఆందోళనలను లేవనెత్తుతామని ప్రతిపక్షాల పార్టీల నేతలు తెలిపారు. ఈ పథకం మిలటరీ నాణ్యతపై ప్రభావం చూపుతుందని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అగ్నిపథ్ పథకంలోని వివిధ అంశాలను పార్లమెంటరీ ప్యానల్‌కు వివరిస్తారు. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (డిఫెన్స్ సెక్రటరీ) అజరు కుమార్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వివేక్ రామ్ చౌదరి కూడా పాల్గొననున్నారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతత్వంలోని ఈ ప్యానెట్‌లో 20 మంది ఎంపీలు ఉన్నారు. అందులో లోక్‌సభ నుంచి 13 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానల్లో రక్షణ శాఖ సహాయ మంత్రి అజరు భట్ కూడా ఉన్నారు. 20 మంది ఎంపిల్లో మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, మనీష్ తివారీ, ఫరూక్ అబ్దుల్లా, ఎ రాజా, సుప్రియా సూలే, సౌగతరారు, సుదీప్ బందోపాధ్యాయ సహా 11 మంది ప్రతిపక్షాలకు చెందిన వారు ఉన్నారు.