Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు గుజరాత్‌కు వెళ్లనున్న సిన్హా
- పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌కు పర్యటన రద్దు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గురువారం ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం చేశారు. ఆయనకు ఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్వాగతం పలికారు. అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపిలతో సమావేశం అయ్యారు. ఎస్పీ, ఆర్ఎల్డీలు యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చాయి. ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిలతో కలిసి యశ్వంత్ సిన్హా సమావేశంలో పాల్గొన్నారు. ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. శుక్రవారం గుజరాత్లో ప్రచారం చేయనున్నారు. అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపిలతో సమావేశం అవుతారు.