Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయమ్మ ప్రకటన
అమరావతి: వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీ వేదికగా ఈ ప్రకటన చేసిన ఆమె పార్టీ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నట్లు కూడా చెప్పారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలకు తోడుగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జగన్ ప్రారంభోపన్యాసం అనంతరం ఉద్విగభరితంగా ప్రసంగించిన విజయమ్మ ' కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా. సంతోషంగా ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే రక్తం పంచుకున్న మరో బిడ్డ షర్మిలకు అన్యాయం చేసినదాన్నవుతానని నా మనస్సాక్షి చెబుతోంది. నేను ఇద్దరి పిల్లలకు తల్లినే. తెలంగాణలో షర్మిలకు నా అవసరం ఉంది. ఆమెకు అండగా ఉంటా నా ఉనికి వివాదాస్పదం కాకుండా ఉండాలనే రాజీనామా చేస్తునా. పార్టీ నుండి కూడా తప్పుకోవాలని అనుకంటున్నా.' అని అన్నారు. తాను రాయని లేఖను రాసినట్లు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాది చేతల పాలన ..ఏపీ సీఎం జగన్
గత ప్రభుత్వాలకు భిన్నంగా తమది చేతల పాలన అని, ఎన్నికలకు ముందు చెప్పింది అధికా రంలోకి వచ్చిన తరువాత చేసి చూపిస్తున్నామని వైసీపీ అధినేత,ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రకటిం చిన మ్యానిఫెస్టోలో 95 శాతం అమలు చేశామని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచామని, అభివృద్ధి సంక్షేమం అంటే ఏమిటో చేసి చూపించామని అన్నారు. ఆచార్య నాగార్జున యూని వర్శిటీకి ఎదురుగా ఉన్న మైదానంలో వైసిపి మూడవ ప్లీనరీ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభ మైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ ప్లీనరీకి ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం పార్టీ గౌరవాధ్యక్షురా లు, తన తల్లి విజయమ్మతో కలిసి ప్రత్యేక విమానం లో విజయవాడ వచ్చిన జగన్మోహన్రెడ్డి అక్కడి నుండి ప్లీనరీ వేదిక వద్దకు భారీ కాన్వారులో వచ్చా రు. వేదిక మీద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహానికి విజయమ్మతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు.