Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకస్మిక వరదల్లో 15మంది మృతి, 45 మందికి పైగా గల్లంతు
శ్రీనగర్: అమర్నాథ్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో 15 మంది యాత్రికులు మృతిచెందారు. 45 మందికిపైగా గల్లంతయ్యారు. జమ్ముకాశ్మీర్లోని అమర్నాథ్లో కుండపోత వర్షం కురుస్తోంది. వరదల ధాటికి అమర్నాథ్ యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. గుడారాల్లో ఉన్న పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 15 మృతదేహాలను సహాయక బందాలు వెలికితీశాయి. మరో 45 మంది ఆచూకీ తెలియాల్సిఉందని సమాచారం. మిగతావారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. బాధితులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అమర్నాథ్ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి కుంభవృష్టి వర్షం కురుస్తుండటంతో సహాయకచర్యలకు కొంత ఆటంకమేర్పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఐటీబీపీ అధికారులు చెబుతున్నారు. వరదల దృష్ట్యా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.