Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందులో కేంద్ర మంత్రులు నిర్మలా, పియూశ్ గోయల్
- పది రాష్ట్రాల నుంచి తొమ్మిది భాషల్లో ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ .ఇటీవలి రాజ్యసభకు ఎన్నికైన 57 మంది సభ్యుల్లో 27 మంది శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛాంబర్లో చైర్మెన్ ఎం. వెంకయ్య నాయుడు సమక్షంలో పది రాష్ట్రాలకు ఎంపిలు తొమ్మిది భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పియూశ్ గోయల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, వివేక్ టంకా, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి, బీజేపీ నేత సరేంద్ర సింగ్ నగర్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. అలాగే తెలంగాణకు చెందిన బీజేపీ నేత కె.లక్ష్మణ్ కూడా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హిందీలో 12 మంది, ఇంగ్లీషులో నలుగురు, సంస్కృతం, కన్నడ, మరాఠీ, ఒరియా భాషల్లో ఇద్దరు చొప్పున, తెలుగు, పంజాబీ, తమిళంలో ఒక్కొక్కరు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన 57 మంది సభ్యుల్లో నలుగురు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. లక్ష్మీకాంత్ వాజ్పేయి, కల్పనా సైని, సులతా డియో, ఆర్. ధర్మర్ ప్రమాణ స్వీకారం చేశారు. 57 మంది సభ్యులలో 14 మంది తిరిగి సభకు ఎన్నికయ్యారు.
ప్రమాణ స్వీకారం చేయని సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయొచ్చు:వెంకయ్య
ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సిన వారు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయవచ్చని చైర్మెన్ వెంకయ్య నాయుడు తెలిపారు. అయితే కొత్తగా ఎన్నికైన సభ్యులు సభా కార్యక్రమాలలో పాల్గొన డానికి ప్రమాణ స్వీకారం తప్పని సరి అని అన్నారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా కోవిడ్ - 19 ప్రోటోకాల్ ప్రకారం జరగనున్నాయని అన్నారు. అర్ధవంతమైన చర్చలు, నియమాలు, సమావేశాలకు కట్టుబడి సభ గౌరవం నిలబెట్టాలని ఆయన సభ్యులను కోరారు. సభలోని లభించే అవకాశాలను సక్రమంగా వినియోగించుకోవాలని, సమావేశాల సమయంలో క్రమం తప్పకుండా సభకు హాజరు కావాలని సభ్యులకు సూచించారు.
కేసీఆర్ జాతీయ పార్టీ పగటి కల: కె.లక్ష్మణ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ అని పగటి కలలు కంటున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ రాజ్య సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనం తరం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుతో కలిసి కె. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీని ప్రశ్నించే స్థాయి కేసీఆర్కు లేదని పేర్కొన్నా రు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. టీఆర్ఎస్లో కట్టప్పలు సిద్ధం గా ఉన్నారని, టీఆర్ఎస్ కట్టప్పల విషయంలో బీజేపీ ది ప్రేక్షకపాత్ర మాత్రమేనని ఆయన అన్నారు. బీజేపీ లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరిక ట్రైలర్ మాత్ర మేనని, సినిమా ముందుందని పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభు త్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు.