Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరికి పోలీసులకు చిక్కి..!
ముంబయి : వివాహేతర సంబంధం నెరుపుతూ.. విదేశాల్లో ఉన్న ప్రియురాలిని కలిసేందుకు వెళుతూ.. భార్యకు దొరకకూడదని.. పాస్‌పోర్ట్‌లోని ఆ పర్యటనకు సంబంధించిన పేజీలు చించేసి.. పోలీసుల అడ్డంగా దొరికిపోయాడో ప్రబుద్ధుడు. పాస్‌పోర్టులోని పర్యటన తాలూకు పేజీలను చించేయడం నేరం కాబట్టి.. అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయం తెలియక చించేసినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. తన స్నేహితురాలిని కలిసేందుకు సదరు వ్యక్తి ఇటీవల విదేశాలకు వెళ్లాడు. గురువారం రాత్రి భారత్‌కు తిరిగి రాగా.. ముంబయి విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఆయన తాజా పర్యటనకు సంబంధించిన వీసా స్టాంపులు పాస్‌పోర్టులో లేకపోవడాన్ని గుర్తించారు. పోలీసులు ప్రశ్నించగా.. అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళుతున్నానని చెప్పి మాల్దీవుల్లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ వద్దకు వెళుతున్నానని చెప్పాడు. భార్యకు అనుమానం వచ్చి.. కాల్స్ చేసినప్పటికీ అతడు ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. భార్యకు ఈ విషయం ఎప్పుటికి తెలియకూడదని.. పాస్‌పోర్ట్‌లో తన ప్రయాణానికి సంబంధించిన పేజీలను చించేశారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మోసం, ఫోర్జరీతో పాటు ఐపిసిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు.