Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బీమా కోరేగావ్-ఎల్గార్ పరిషద్ కేసులో నిందితులు పి వరవర రావు దాఖలు చేసిన శాశ్వత మెడికల్ బెయిల్ పిటీషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారిం చనుంది. ఈ బెయిల్ పిటీషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును వరవరరావు ఆశ్రయించారు. జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుదాన్షు దౌలియాతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ను విచారించే అవకాశముంది. 83 ఏళ్ల వరవరరావు ఈ కేసులో ఇప్పటికే రెండేళ్ల జైలు శిక్ష అనుభవించారని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని, వయస్సు పెరుగుందని ఈ రెండింటితో ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశ ముందని వరవరరావు తరుపు లాయర్ నుపుర్ కుమార్ బెయిల్ పిటీషన్లో పేర్కొన్నారు. అలాగే వరవరరావును హైదరాబాద్కు తరలించాలని కూడా పిటీషన్లో అభ్యర్థించారు. ఈ కేసులో 2018, ఆగస్టు 18న వరవరరావు హైదరాబాద్లో అతని నివాసం నుంచి మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.