Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కవి వరవరరావు మెడికల్ బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు నేటీకి (మంగళవారం) వాయిదా వేసింది. భీమా కోరెగావ్ కేసులో నిందితునిగా ఉన్న వరవరరావు ఆరోగ్య కారణాల రీత్యా తనకు శాశ్వత బెయిల్ ఇవ్వాలని ముంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ముంబాయి హైకోర్టు ఆ పిటషన్ను కొట్టివేయడంతో దానిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ యు. యు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం పిటిషన్ విచారణ చేపట్టింది. విచారణకు అవసరమైన పత్రాల సమర్పణకు తమకు ఒకరోజు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వరవరరావు తరపు సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ మంగళవారం విచారణకు తనకు అభ్యంతరం లేదన్నారు. దీంతో మంగళవారం తొలి కేసుగా చేపడతామంటూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.