Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు
- పాడి రైతులకు డీఎఫ్ఎఫ్ఐ పిలుపు
న్యూఢిల్లీ : పాడి ఉత్పత్తులు, మెషనరీపై జీఎస్టీ విధింపును వ్యతిరేకిస్తూ.. పాలకు తగిన ధరను కల్పించాలన్న డిమాండ్‌తో పాడి రైతులు ఈ నెల 27న పార్లమెంటు మందు ధర్నాకు దిగనున్నారు. అలాగే, దేశవ్యాప్త నిరసనలలో పాల్గొననున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న పాడి రైతులకు అఖిల భారత కిసాన్ సభలో భాగమైన భారత పాడి రైతుల సమాఖ్య (డీఎఫ్ఎఫ్ఐ) పిలుపునిచ్చింది. ఇందులో పాల్గొనాల్సిందిగా పాడి సహకార సంఘాలు, వ్యాపారులను కోరింది. జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల తీసుకున్న నిర్ణయం రైతులపై మరింత భారాన్ని మోపిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర అంశాలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పశువుల మేత ధరలు విపరీతంగా పెరగటం పాడి రైతులను కష్టాల్లోకి నెట్టినట్టు నివేదికలు చెబుతున్నాయి.ఈ పరిస్థితుల నేపథ్యంలో డీఎఫ్ఎఫ్ఐ కొన్ని ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్త నిరసనలో పాల్గొనాలంటూ పాడి రైతులకు పిలుపునిచ్చింది. అవి
ొ పాల ఉత్పత్తులు, యంత్రాలు, పాలు పితికే యంత్రాలపై జీఎస్టీ విధించటాన్ని కేంద్రం తప్పనిసరిగా రద్దు చేయాలి
ొ స్వామినాథన్ కమిషన్ సిఫారసు ఆధారంగా పాలకు న్యాయమైన, లాభసాటి ధర (ఎఫ్ఆర్పీ)ని ప్రభుత్వం నిర్ధారించాలి.
ొ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించటానికి పచ్చి మేతను సబ్సిడీ ధరకు సరఫరా చేయటం ద్వారా ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలి
వీటితో పాటు ఎంజీఎన్ఆర్ఈజీఏలో ప్రత్యేక నిబంధనను జోడించి పాల ఉత్పత్తి ధరను తగ్గించాలని డిమాండ్ చేసింది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం అమలు చేసిన అయ్యంకాళి పట్టణ ఉపాధి హామీ పథకం లాంటిదే ఇది. కాగా, ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తమ ప్రచారంలో కరపత్రాల పంపిణీ, సంతకాల సేకరణ ఉంటుందని డీఎఫ్ఎఫ్ఐ తెలిపింది. అదే రోజు (27న) దేశవ్యాప్తంగా గ్రామ లేదా తాలూకా స్థాయిలో పాల సేకరణ కేంద్రాల వద్ద కూడా భారీ నిరసనలు నిర్వహించనున్నట్టు డీఎఫ్ఎఫ్ఐ వివరించింది. కేంద్ర అనుసరిస్తున్న బడా కార్పొరేటు అనుకూల విధానాలను ప్రతిఘటించేందుకు పాడి రైతులు, సహకార సంఘాలు, వ్యాపారుల ఐక్యత ప్రస్తుత సమయంలో అవసరమని డీఎఫ్ఎఫ్ఐ ధృఢంగా అభిప్రాయపడింది.