Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆకాశంలో మరోసారి సూపర్మూన్ కనువిందు చేయనుంది. ఈ నెల 13న అనగా బుధవారం చందమామ భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. భూమికి 3,57,264 దూరంలో చంద్రుడు రానున్నాడు. దీనిని బక్ మూన్ అని కూడా పిలుస్తారు. బుధవారం రాత్రి 12.07 గంటలకు ఈ అద్భుతం ఆవిష్కతం కానుంది. సూపర్ మూన్ కారణంగా సముద్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ సమయంలో సముద్ర ప్రాంతాల్లో తుఫానులు వచ్చి.. తీర ప్రాంతాలు వరదలకు దారి తీస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.