Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్‌లో 7.01 శాతానికి రిటైల్ సూచీ
న్యూఢిల్లీ : అధిక ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లకు ఆజ్యం పోయనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ అంచనాల కంటే దేశంలో నమోదవుతున్న అధిక ధరలు మరిన్ని సార్లు వడ్డీ రేట్లు పెంచడానికి కారణం కానున్నాయని రాయిటర్స్ పోల్‌లో నిపుణుల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఏడాది మే, జూన్‌లో ఆర్బీఐ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రస్తుత ఏడాది జూన్‌లోనూ రిటైల్ వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీ (సీపీఐ) 7.01 శాతంగా నమోదయ్యిందని మంగళవారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. ఇంతక్రితం మే మాసంలో 7.04 శాతంగా చోటు చేసుకుంది. దీంతో పోల్చితే గత నెలలో అతి స్వల్పంగా తగ్గినప్పటికీ.. ప్రమాదకర స్థాయిలోనే ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి అటూ, ఇటుగా 2 శాతం హెచ్చు, తగ్గులకు పరిమితం చేయాలనేది ఆర్బిఐ లక్ష్యం. గరిష్టంగా 6 శాతానికి మించకుండా చూడాలని నిర్దేశించుకున్నప్పటి కీ.. దీనికి భిన్నంగా ఏడు శాతం ఎగువన చోటు చేసుకోవడం ఆందోళ నకర అంశం. వంట నూనెలపై ధరల ను స్వల్పంగా తగ్గించడంతో గడిచిన జూన్ మాసంలో అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సూచీ 7.75 శాతానికి తగ్గింది. ఇంతక్రితం మాసం మేలో ఇది 7.97 శాతంగా చోటు చేసు కుంది. గడిచిన నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా 17.37 శాతానికి ఎగిసింది. ఇంధన, వెలుతురు ద్రవ్యోల్బణం 9.54 శాతం నుంచి 10.39 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఆర్బిఐ కీలక వడ్డీ రేటు 4.90 శాతంగా ఉంది. ఈ ఏడాది ముగింపు నాటికి దీన్ని 5.65 శాతానికి చేర్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత త్రైమాసికం ముగింపు నాటికి రెపో రేటును 5.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని 48 మంది ఆర్థిక నిపుణుల్లో 25 శాతం మంది అంచనా వేశారు. వచ్చే ఆగస్టులో జరగనున్న ఆర్బిఐ ఎంపిసి సమావేశంలో రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచి 5.25 శాతానికి చేర్చొచ్చని 35 మందిలో 10 మంది అభిప్రాయ పడగా.. స్వల్ప పెరుగుదల ఉండొ చ్చని 14 మంది అంచనా వేశారు. వడ్డీరేట్ల పెరుగుదల వల్ల రుణ గ్రహీతలపై ఈఎంఐ భారం పడనుంది.