Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పింగళి వెంకయ్య జయంతి నిర్వహణ
- కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడి
న్యూఢిల్లీ :ఆజాదీ కా అమృత్ మహోత్సy ్(ఏకేఏఎం)లో భాగంగా 'హర్ ఘర్ తిరంగా (ప్రతి ఇంటిపై జాతీయ జెండా)' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కేంద్రం సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమ నండూరి తెలిపారు. ఆగస్టు 11 నుంచి 17 వరకూ దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ఎగురవేయాలనీ, అందుకు ప్రచారం కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడిక్కడ ఏకేఏఎం డైరెక్టర్ ప్రియాంకా చంద్రతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సమ్ కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుం దనీ, అందులో భాగంగానే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని శాఖలు, విభాగాలు ఫ్లాగ్ కోడ్‌ను అనుసరించాలని సూచించారు. జెండాల సరఫరాకు రాష్ట్రాల్లో పంచాయతీ రాజ్ విభాగాలు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తాయన్నారు. జెండాల సరఫరాకు ఈ-కామర్స్, స్వయం సహాయక సంఘాలను కూడా వినియోగించుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాల న్నారు. ప్రతి నెలా స్వాతంత్య్ర సమరయోధుల జయంతులు నిర్వహిస్తున్నామనీ, అన్ సంగ్ హీరోలను గుర్తించి వారి పేరిటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, కందుకూరి వీరేశలింగం పంతులు, తెలంగాణకు చెందిన కొమురం భీం తదితరుల జయంత్యుత్స వాలు చేశామన్నారు. మువ్వెన్నల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 2న దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. స్వాత్రంత్య పోరాటం, 75 నుంచి 100వ స్వాతంత్య్ర వేడుకల మధ్య కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆలోచనలు, వందేండ్ల స్వాతంత్య్ర వేడుకల దిశగా చేయాల్సిన సమష్టి సంకల్పం, దేశాభివృద్ధికి అవసరమైన విధానాలు, నిబద్ధత, 5వేల ఏండ్లకు పైగా చారిత్రక నేపథ్యం ఉన్న 75 ఏళ్లలో సాధించిన విజయాలు థీమ్‌లుగా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపడుతున్నామన్నారు. మొత్తంగా 150 దేశాలు, 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో 55 మంత్రిత్వ శాఖలు కలిపి 42వేల కార్యక్రమాలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రియాంక చంద్ర తెలిపారు.