Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్‌సీఈఆర్‌టి నిర్ణయాన్ని ఖండించిన టీచర్స్ ఫోరం
న్యూఢిల్లీ : విద్యార్ధుల సిలబస్ నుండి వాతావరణ మార్పులకు సంబంధించిన అధ్యాయాలను తొలగించాలన్న ఎన్‌సిఇఆర్‌టి నిర్ణయాన్ని టీచర్ల ఫోరం తీవ్రంగా ఖండిం చింది. దీనిపై పునరాలోచించి, ఆ అధ్యాయాలను తిరిగి ప్రవేశపెట్టాల్సిందిగా కోరింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమ ర్శలు వెల్లువెత్తుతున్న వేళ టీచర్స్ అగైనెస్ట్ క్లైమేట్ క్రైసిస్ (టిఎసిసి) ఈ మేరకు ఒక ప్రకటనను ఇటీవల విడుదల చేసింది. ఆరు నుండి 12వ తరగతి వరకు విద్యార్ధుల సిలబస్‌ల్లో కాలుష్యకారక వాయువుల ప్రభావం, వాతావరణ మార్పులు, పర్యావరణంపై ప్రజా ఉద్యమాలకు సంబంధించిన అధ్యాయాలు చాలా కీలకమైనవని, వాటిని తొలగించరాదని పేర్కొంది. ఢిల్లీలో, చుట్టుపక్కల గల కాలేజీ, యూనివర్శిటీ టీచర్లకు చెందిన పార్టీయేతర, లాభార్జన లేని సంస్థ టిఎసిసి.
వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వివిధ స్థాయిల్లో వ్యవస్థాగత మార్పులు చాలా అవసరమని, ముఖ్యంగా యువత ఇందులో పాల్గొనాలని, ప్రస్తుత కాలంలో ఇది అత్యంత సమకాలీన సమస్యగా మారిపోయిందని పేర్కొంది. కోవిడ్ కారణంగా తలెత్తిన ఆటంకాలు, అంతరాయాల వల్ల ఆరు నుండి 12 తరగతి వరకు విద్యార్ధుల సిలబస్‌లో ఎన్‌సిఇఆర్‌టి చాలా మార్పులు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 30శాతం సిలబస్‌ను తగ్గించేసినట్లు అధికారులు చెబుతున్నారు.