Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలకు తరలిస్తున్న సీఈసీ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధమయ్యాయి. తగిన భద్రతా చర్యలతో వారిని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు అప్పగించారు. జూలై 18న రాష్ట్ర అసెంబ్లీల్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, పెన్నులు, ఇతర సీల్డ్ మెటీరియల్‌ల పంపిణీని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ప్రారంభించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ (ఈసీ) అనుప్ చంద్ర పాండేతో కలిసి నిర్వాచన్ సదన్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు రాష్ట్రపతి ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్స్, తదితర పోలింగ్ సంబంధిత మెటీరియల్ పంపిణీని పర్యవేక్షించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి నుంచి నియమించిన బృందాలు ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి ఎన్నికల సామగ్రిని సేకరించారు. ఢిల్లీ పోలీసు బృందాలు వారిని ఎస్కార్ట్ చేశాయని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ''అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సామాగ్రిని సేకరించిన రోజునే వారి సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తిరిగి వెళ్తారు. ప్రయాణించే సమయంలో బ్యాలెట్ బాక్స్‌లు వ్యక్తిగత పర్యవేక్షణలో అధికారి సీటు పక్కన ఉంటుంది. విమానంలో ముందు వరుసలో ప్రత్యేక సీటు కేటాయిస్తారు'' అని ఈసీ తెలిపింది. వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాచల్‌ప్రదేశ్ బ్యాలెట్ బాక్స్‌ను మంగళవారం రోడ్డు మార్గంలో పంపినట్టు ఎన్నికల సంఘం అధికారి తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి : రాజీవ్ కుమార్, సీఈసీ
ఈ సందర్భంగా ఏఆర్ఓలను ఉద్దేశించి చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో సహా ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వ కోసం ప్రోటోకాల్‌లు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరారు.