Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5జి రేసులో దిగ్గజ సంస్థలు
- 26 నుంచి వేలం ప్రారంభం
న్యూఢిల్లీ : త్వరలో నిర్వహించనున్న 5జి స్పెక్ట్రం వేలంలో నాలుగు దిగ్గజ సంస్థలు పాల్గొనడానికి దరఖాస్తులు సమర్పించాయి. తొలిసారి ఈ రంగంలోకి అదానీ గ్రూపు ప్రవేశించడానికి రంగం సిద్దం చేసుకుంది. ఇందుకోసం అదానీ డాటా నెట్వర్క్స్ లిమిటెడ్ దరఖాస్తు చేసుకుంది. అదానీ డాటా సహా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెల్కోలు ముందుకు వచ్చాయని మంగళవారం టెలికం శాఖ వెల్లడించింది. జులై 26 నుంచి 5జి స్పెక్ట్రం వేలం నిర్వహించనున్నట్లు తెలిపింది. ధరఖాస్తుల ఉపసంహరణకు జూలై 19 వరకు సమయం కల్పించింది. 600 ఎంహెచ్‌జెడ్, 700 ఎంహెచ్‌జెడ్, 800 ఎంహెచ్‌జెడ్, 900 ఎంహెచ్‌జెడ్, 1800 ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్, 2300 ఎంహెచ్‌జెడ్, 2500 ఎంహెచ్‌జెడ్, 3300 ఎంహెచ్‌జెడ్, 26 గిగాహెడ్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ను వేలానికి పెట్టింది. 4జి కంటే 5జి డేటా వేగం 10 రెట్లు ఎక్కువ. మొత్తంగా 72,097.85 మెగాహెడ్జ్స్ స్పెక్ట్రాన్ని వేలం వేయడం ద్వారా కనీసం రూ.4.3 లక్షల ఆదాయాన్ని రాబట్టుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్పెక్ట్రాన్ని దక్కించుకున్న సంస్థలు 20 ఏళ్ల పాటు వాడుకోవడానికి వీలుంది. టెలికం రెగ్యూలేటరీ అథారిటీ (ట్రారు) ప్రతిపాదించిన స్పెక్ట్రం ధరలకు గత నెలలో కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.