Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16న రాజ్‌ఘాట్ వద్ద మౌన దీక్ష
- ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో మౌనదీక్ష చేయనున్నట్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ తెలిపారు. జులై 16న మహాత్మా గాంధీ సమాది రాజ్‌ఘాట్‌లో మద్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు మౌన దీక్ష చేస్తానని వెల్లడించారు. బుధవారం ఏపీ భవన్లో కెఎ పాల్ మీడియాతో మాట్లాడుతూ విభజన హామీల అమలు కోసం తనతో కలిసి రావాలని జగన్, కెసిఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల, ప్రవీణ్ కుమార్, కోదండరాం, సీపీఐ(ఎం), సీపీఐ సహా అన్నిపార్టీల నేతలను దీక్షకు ఆహ్వానించినట్టు తెలిపారు.