Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలై 16 నుంచి 18 వరకు నిర్వహణ: లక్ష్మయ్య
న్యూఢిల్లీ: ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ టీడబ్ల్యూఎఫ్) 11వ అఖిల భారత మహాసభ హర్యానాలోని హిసార్‌లో జూలై 16 నుంచి 18 వరకు జరగనున్నాయని ఆ సంఘ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆర్.లక్ష్మయ్య తెలిపారు. బుధవారం నాడిక్కడ ఆయన మీడియా తో మాట్లాడుతూ దేశంలో రోడ్డు రవాణా రంగం ప్రాముఖ్యత పెరుగుతో ందని, మరోవైపు ప్రభుత్వ క్రూరమైన విధానాలతో తీవ్ర ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోతుందని విమర్శించారు. మొత్తం రోడ్డు రవాణా రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. హిసార్‌లోని ఫ్లెమింగో టూరిజం కాంప్లెక్స్‌లో జరిగే మహాసభలో మోడీ సర్కార్ తిరోగమణ విధానాలపై చర్చిస్తామని అన్నారు.
దేశం నలుమూలల నుంచి ఆటో రిక్షా, ట్యాక్సీ, ప్రైవేట్ బస్సు, ఆర్టీసీ బస్సు, ట్రక్కు తదితర సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 600 మంది ప్రతినిధులు ఈ మసహాసభకు హాజరవుతారని తెలిపారు. సీఐటీయూ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు ఎలమారం కరీం ఈ మహాసభను ప్రారంభిస్తారని అన్నారు. రోడ్డు రవాణా రంగంలో పని చేసే అన్ని జాతీయ స్థాయి ఫెడరేషన్లు, ప్రధాన స్వతంత్ర యూనియన్లను కూడా ప్రారంభ సభకు ఆహ్వానించామని చెప్పారు. ఈ మహాసభలో రోడ్డు రవాణా రంగ పరిస్థితి, కార్మికుల స్థితిగతులపై ప్రధానంగా చర్చిస్తామని అన్నారు. రోడ్డు రవాణా రంగాన్ని, కార్మికుల జీవనోపాధిని కాపాడేందుకు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు