Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎఎ రహీమ్, హిమఘ్నరాజ్ బట్టాచార్య
న్యూఢిల్లీ : దేశంలోని యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తు నిరుద్యోగానికి వ్యతిరేకంగా నవంబరు 3న పార్లమెంట్ మార్చ్ (యువజన మార్చ్) చేపడుతున్నామని డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎఎ రహీమ్, హిమఘ్నరాజ్ బట్టాచార్య వెల్లడించారు. పెరుగుతున్న నిరుద్యోగం, కేంద్ర ప్రభుత్వ యువత వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. డీవైఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ కమిటీ సమావేశం ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో జూలై 12, 13 తేదీల్లో జరిగింది. ఈ సమావేశంలో దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీవైఎఫ్ఐ నేతలు సంజరు కుమార్, జైక్సి థామస్, సనోజ్ కుమార్, బికాశ్లతో కలిసి ఎఎ రహీమ్, హిమఘ్నరాజ్ బట్టాచార్య మాట్లాడారు