Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్‌ను కలిసిన
ఏఐబీఓసీ నేతలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్ (పీఎస్బీ)ల ప్రయివేటీకరణ విధానాన్ని అడ్డుకోవడంలో టీఆర్ఎస్ పార్టీ మద్దతును ఇవ్వాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏఐబీఓసీ తెలంగాణ యూనిట్ నేతలు కోరారు. ఈ సందర్బంగా కెేటీఆర్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో పీఎస్‌బీలు విశేష పాత్రను పోశిస్తున్నాయని పేర్కొన్నారు. వీటి ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నామ న్నారు. దీని ప్రతిపాదిత బిల్లుపై పార్లమెంట్లో తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించనుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏఐబీఓసీ తగు పోరాటాన్ని కొనసాగించడం ప్రశంసనీయమ న్నారు. కెటిఆర్‌ను కలిసిన వారిలో ఏఐబీఓసీ నేతలు ఎం శివ మోహన్, జి వెంకన్న, మల్లికార్జున రావు, సాంబశివరావు ఉన్నారు.