Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 75 రోజుల వరకు అందజేత
- కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం
న్యూఢిల్లీ : 18 ఏండ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందించేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం బుధవారం జరిగింది. అనంతరం నేషనల్ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మంత్రి వర్గ నిర్ణయాలను వెల్లడించారు. జూలై 15 నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరూ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా తీసుకోవచ్చని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగానే ఈ ఉచితంగా బూస్టర్ డోస్ అందిస్తామనీ, అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
రాజస్థాన్, గుజరాత్ మధ్య కొత్త రైల్వే మార్గం
రాజస్థాన్, గుజరాత్ మధ్య తరంగ హిల్-అంబాజీ-అబు రోడ్ కొత్త రైలు మార్గానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2,798.16 కోట్లుగా నిర్ణయించింది. 2026-27 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త రైలు మార్గం మొత్తం పొడవు 116.65 కిలో మీటర్లు ఉంటుంది.
గతిశక్తి యూనివర్సిటీగా ఎన్ఆర్టీఐ
రవాణా రంగంలో విద్య, శిక్షణ, నైపుణ్యం, పరిశోధనలకు కేంద్రంగా ఉపయోగపడే నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఆర్టీఐ)ని గుజరాత్‌లోని గతి శక్తి విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేయడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.
ఎన్ఆర్టీఐని డిమ్డ్-టు-బి-యూనివర్శిటీ నుండి సెంట్రల్ యూనివర్శిటీగా అప్‌గ్రేడ్ చేయడాని ఆమోదం తెలిపినట్టు అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.