Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిమినల్ కేసుల ఓటర్లు 43శాతం
- 28 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు
- కోటీశ్వరుల్లో ఐదో స్థానంలో చంద్రబాబు : ఏడీఆర్ రిపోర్టు వెల్లడి
న్యూఢిల్లీ : ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ఎంపీలు, ఎమ్మెల్యే (ఓటర్లు)ల్లో 43 శాతం మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ)లు పేర్కొన్నాయి. 28శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. మొత్తం 4,759 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల నేర చరిత్ర, ఆస్తుల వివరాలు సంయుక్తంగా పరిశీలించి నివేదిక రూపొందించింది. నేర చరిత్ర సంఖ్యలో తొలిస్థానంలో కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డిన్ కురియాకోజ్ ఉండగా ఐదో స్థానంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నారని పేర్కొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ పరిశీలించి ఆయనపై ఐపీసీ సెక్షన్లు 332, 307, 324, 382, 153ఏ, 511, 505, 435, 477, 153బీ నమోదైనట్టు తెలిపింది. ఆస్తుల్లో టిఆర్ఎస్ ఎంపి బండి పార్థసారధి తొలిస్థానంలో, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి రెండోస్థానంలో టీడీపీ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు ఐదో స్థానంలో ఉన్నట్టు పేర్కొంది.
దేశవ్యాప్తంగా 4,809 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 4759 మంది అఫిడవిట్లను పరిశీలించింది. 4,759 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు 10,86,431 కాగా 10,74,364 ఓట్లు పరిశీలించగా 4,72,477 (44శాతం) ఓట్లుపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. 4,759 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు గానూ 2,030 (43శాతం) సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 542 మంది లోక్‌సభ సభ్యులకుగానూ 236 (44శాతం) మంది, 226 మంది రాజ్యసభ్యులకుగానూ 71( 31 శాతం) మంది, 3,991 మంది ఎమ్మెల్యేలకు గానూ 1,723 (43శాతం) మంది ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. 4,759 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకుగానూ 1,316(28శాతం) మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 4,759 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 61 మంది తమపై మర్డర్ కేసులు ఉన్నాయి. 4,759 మంది ఎంపిలు, ఎమ్మెల్యేల్లో 223 మంది తమపై హత్యాయత్నం కేసులు నమోదు.
తెలుగు రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్‌లో 175 ఎమ్మెల్యేలకు గానూ 174 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు పరిశీలించగా 95 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయనీ, 54 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలకు గానూ 119 ఎమ్మెల్యేల అఫిడవిట్లు పరిశీలించగా 72 మంది క్రిమినల్ కేసులు, 47 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. టీడీపీలో 12 మంది ఎంపీ, ఎమ్మెల్యేలపైన క్రిమినల్ కేసులు, ఐదుగురుపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. వైసీపీలో 98 మంది ఎంపీ, ఎమ్మెల్యేలపైన క్రిమినల్ కేసులు, 60 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. టీఆర్ఎస్లో 54 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు క్రిమినల్, 36 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.