Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అవినీతి నుంచి జుమ్లాజీవి వరకు 65 పదాలను అన్‌పార్లమెంటరీ పదాలుగా లోక్‌సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఈ మేరకు ఆయా పదాలను ఉభయ సభల్లో తొలగించారు. దీనిపై ప్రతిపక్షాలు విమ ర్శలు ఎక్కుపెట్టాయి. ఎంపిలపై గాగ్ ఆర్డర్ ఇచ్చారంటూ మండి పడ్డాయి. మరోవైపు ఏ పదాలను తాము నిషేధించలేదని, తొలగించామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో అన్‌పార్లమెంటరీ పదాలుగా పేర్కొంటూ తొలగించిన పదాల జాబితాతో కూడిన బుక్‌లెట్‌ను గురువారం లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసింది. ఈ బుక్లెట్ ఎడిటోరియల్ బోర్డులో లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్‌తో పాటు సంయుక్త కార్యదర్శి వినరు కుమార్, డైరెక్టర్ మహావీర్ సింగ్, జాయింట్ డైరెక్టర్లు నారాద్ ప్రసాద్ కోముథి, సునీతా అరోరా, ఎడిటర్ సునీతా థాప్లియల్, అసిస్టెంట్ ఎడిటర్ మనీషా భూషన్ ఉన్నారు. ఈ బుక్‌లెట్‌లో వివిధ సందర్భాల్లో 2021లో లోక్‌సభ, రాజ్యసభ, ఏపితో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీలు అన్‌పార్లమెంటరీగా ప్రకటించబడిన పదాలు, 2020లో కొన్ని కామన్వెల్త్ పార్లమెంట్లలో అనుమతించబడని పదాలు పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రికార్డుల్లోనుంచి దాదాపు 63 పదాలను తొలగించారు. జుమ్లజీవి, బాల్ బుద్ధి, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్‌గేట్ వంటి పదాలతో పాటు సాధారణంగా ఉపయోగించే సిగ్గు, దుర్వినియోగం, ద్రోహం, అవినీతి, నాటకం, వంచన, అసమర్థుడు వంటి పదాలను లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ అన్‌పార్లమెంటరీగా పరిగణించారు. అరాచకవాది, శకుని, నియంతృత్వం, తానాషా, తానాషాహి, జైచంద్, వినాష్ పురుష్, ఖలిస్తానీ, ఖూన్ సే ఖేతీ కూడా తొలగించబడ్డాయి. దోహ్రా చరిత్ర, నికమ్మ, నౌతంకి, దిండోరా పీట్నా, బెహ్రీ సర్కార్ వంటి పదాలను అన్‌పార్లమెంటరీ వ్యక్తీకరణలుగా జాబితా చేసింది. ఆంగ్ల పదాలలో పిరికివాడు, నేరస్థుడు,మొసలి కన్నీరు, బ్లడ్‌షెడ్, బ్లడీ, బిట్రేడ్, షేమ్డ్, అబ్యూజ్డ్, చీటెడ్, చంచా, చెలాస్, పిల్లతనం పదాలు ఉన్నాయి. అవమానం, గాడిద, నాటకం, కళ్లజోడు, ఫడ్జ్, పోకిరితనం, కపటత్వం, అసమర్థత, తప్పుదారి పట్టించడం, అబద్ధం, అసత్యం వంటి పదాలు కూడా తొలగించబడ్డాయి.