Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురిని అరెస్టు చేసిన యూపీ పోలీసులు
న్యూఢిల్లీ : మోడీ పాలనలో నిరసనలు తెలపటానికీ పౌరులకు స్వేచ్ఛ ఉండటం లేదు. బీజేపీ పాలిత యూపీలో తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటనే దీనికి నిదర్శనం. మోడీకి వ్యతిరేకంగా ఒక వ్యంగ్య చిత్రాన్ని ప్రదర్శించినందుకు గానూ ఐదుగురిని ప్రయాగ్రాజ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ప్రింటింగ్ ప్రెస్ యజమాని కాగా మరొకరు ఈవెంట్ నిర్వాహకుడు ఉన్నారు. ఈ ఐదుగురిని అనికేత్ కేసరీ, అభరు కుమార్ సింగ్, రాజేశ్ కేసర్వానీ, శిశ్, నంకా అలియాస్ ధర్మేంద్ర లుగా గుర్తించారు. నగరంలోని కలోనెల్గంజ్ ప్రాంతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హౌర్డింగ్పై వ్యంగ్యచిత్రాన్ని ప్రదర్శించారు. రైతుల పోరాటంలో అన్నదాతలు అసువలుబాసరనీ, కాంట్రాక్టు పనులతో యువత ఆశలను అడియాశలు చేశారనీ, ఇంధన ధరల పెరుగుదలపై కేంద్రం తీరును విమర్శిస్తూ అందులో ఉన్నది. అయితే, ఈ హౌర్డింగ్పై ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు కేసును నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ ఐదుగురిని పోలీసులు గుర్తించారు.