Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ మందా జగన్నాధంకు నాగకర్నూల్ జడ్పీ వైస్ చైర్మెన్ వినతి
న్యూఢిల్ల్లీ: ఢిల్లీలో తెలంగాణ గళం విప్పాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి నియమితులైన డాక్టర్ మంద జగన్నాధం ను నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ విన్నవించారు.మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని కోరారు. మందాను మర్యాద పూర్వకంగా కలిసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ శంకర్ నాయక్, సీనియర్ నాయకులు రైతు వేదిక అధ్యక్షులు రాజూ గౌడ్, వసుపుల జంగయ్య, పొనుగోటి రవీందర్ రావు, కొండల్ రావు,గణేష్, కొండల్,వెంకటేశ్. క్రిష్ణ,లక్ష్మణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.