Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాట్నా హైకోర్టుకు హాజరు కావాలన్న ఆదేశాలకు సుప్రీంకోర్టు బ్రేక్
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రారును తమ ముందు హాజరుకావాలని ఆదేశించడంతోపాటు ముందస్తు బెయిల్ కేసులో పాట్నా హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టి వేసింది. మరొకరి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా పాట్నా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పాట్నా హైకోర్టు తన ముందు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ మంజూరు కోసం దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తు న్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకున్నదని సహారా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తును నిర్ణయించడానికి సంబంధించిన వాస్తవాలకు ''సంబంధం లేని'' విషయాలపై విచారణ జరిపిందని సుప్రీంకోర్టు పేర్కొంది.
''ప్రస్తుత కేసులో, హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు కోసం చేసిన దరఖాస్తును పెండింగ్లో ఉంచినట్టు మేం గమనించాం.థర్డ్ పార్టీలను కోర్టుకు హాజరుకావాలని నోటీసు జారీ చేయడంతో సహా ఆదేశాలు జారీ చేసింది. మా అభిప్రాయం ప్రకారం, అది అనుమతిం చబడదని న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం స్పందించింది. ఫిబ్రవరి 11, ఏప్రిల్ 27, 2022, పాట్నా హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
తన ముందు పెండింగ్లో ఉన్న బెయిల్ పిటిషన్లో సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ లిమిటెడ్ , సుబ్రతా రారులను వ్యతిరేక పక్షాలుగా చేర్చాలని ఫిబ్రవరి 11న ఆదేశించిన పాట్నా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు గతంలో స్టే విధించింది మరియు తరువాత వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఏప్రిల్ 27న, పాట్నా హైకోర్టు సుబ్రతా రారును వ్యక్తిగతంగా తన ముందు హాజరు కావాలని ఆదేశించింది, సహారా గ్రూప్ , ఇతర కంపెనీలు దాదాపు ఒక నెల క్రితం వరకు డిపాజిట్లు తీసుకున్నాయి, పెట్టుబడి తిరిగి రావడానికి ప్రణాళికను రూపొందించాలని ఆదేశించిందని సహారా సంస్థ ఆ ప్రకటనలో పేర్కొన్నది.