Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నుస్రాత్ మీర్జాతో ఫొటో విడుదల
- మరోసారి ఖండించిన మాజీ ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ : మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ లక్ష్యంగా బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. 2009లో తీవ్రవాదంపై జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సు వేదికపై పాకిస్తాన్ జర్నలిస్టు నుస్రాత్ మీర్జాతో హమీద్ అన్సారీ కలిసి ఉన్న ఫోటోను శుక్రవారం విడుదల చేసింది. 'తీవ్రవాదంపై 2009 సదస్సు లేదా నుస్రాత్ మీర్జా చెబుతున్నట్లుగా 2010 సదస్సుతో సహా ఏ సదస్సుకూ నుస్రాత్ మీర్జాను ఆహ్వానించలేదు, అతన్ని కలవలేదు అని గతంలో చెప్పిన మాటకే హమీద్ అన్సారీ కట్టుబడి ఉన్నారు' అని హమీద్ అన్సారీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్్ గూఢచారి, పాకిస్తాన్్ జర్నలిస్టు నుస్రాత్ మీర్జా హమీద్ అన్సారీ ఆహ్వానం మేరకు ఐదుసార్లు భారత్‌కు వచ్చారని, అన్సారీ ఇచ్చిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశారని బీజేపీ చేసిన ఆరోపణలను అన్సారీ ఇప్పటికే ఖండించారు. బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలని పేర్కొన్నారు.
హమీద్ అన్సారీపై బీజేపీ దాడి సిగ్గుచేటు : సీపీఐ(ఎం)
భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. 'డాక్టర్ హమీద్ అన్సారీ చిత్తశుద్ధి, దేశభక్తిపై బీజేపీ దాడి చేయడం హేయమైన చర్య. ఆయనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. . ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సహా ప్రముఖ విద్యావేత్త, దౌత్యవేత్త, భారత ఉపరాష్ట్రతిగా ఆయన భారత ప్రయోజనాల కోసం అనేక వేదికలపై సేవలందించారు. రాజ్యాంగ విలువల కోసం దృఢంగా నిలబడే ప్రముఖులపై దాడి కోసం బీజేపీ ఇటువంటి డర్టీ ట్రిక్స్‌కు పాల్పడడం సిగ్గు చేటు.. డాక్టర్ హమీద్ అన్సారీకి వ్యతిరేకంగా హానికరమైన అబద్ధాలను ఆపండి' అని సీపీఐ(ఎం) పేర్కొంది.